Monkey Fever | మంకీ ఫీవర్ కలకలం..! పొరుగు రాష్ట్రంలో 31 మందికి సోకిన కేఎఫ్‌డీ..!
Monkey Fever | కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరారు.
Monkey Fever | కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరారు. మిగతా వారంతా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఇంత వరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. మంకీ ఫీవర్ తొలి కేసు జనవరి 16న నమోదైంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) పేరుతోనూ పిలుస్తుంటారు.
ఇది జంతవుల నుంచి మనుషులకు సోకుతుంది. కోతుల్లో కనిపించే పేలు మనుషులను కాటు వేయడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. మంకీ ఫీవర్ దేశంలోని కర్నాటక, మహారాష్ట్ గోవాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్ కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కేడీఎఫ్తో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంకీ ఫీవర్‌తో ఒక్కసారిగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
వ్యాధి తీవ్రత పెరుగుతున్న సమయంలో వాంతులు, విరేచనాలు తదితర సమస్యలుంటాయని తెలిపారు. మంకీ ఫీవర్ తీవ్రమైన సందర్భాల్లో ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. కొందరు వ్యక్తుల్లో వణుకు, అసాధారణంగా నడక, మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మంకీ ఫీవర్ బారినపడిన సమయంలో లక్షణాలు ముందుగానే గుర్తించి సరైన చికిత్స సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఈ కేఎఫ్‌డీకి నిర్ధిష్టంగా చికిత్స ఏమీ లేదు.
అయితే లక్షణాలను గుర్తించడం ద్వారా సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. మంకీ ఫీవర్ నుంచి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచించారు. కేఎఫ్‌డీకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇవి ఇన్ఫెక్షన్ను నిరోధించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మంకీ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులంతా పేల బారినపడకుండా ఉండేందుకు ఒంటిని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

