PM Modi | తెలంగాణలో రుణ మాఫీ పేరుతో రైతులకు కాంగ్రెస్ టోకరా : ప్రధాని మోదీ
PM Modi : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు.
PM Modi : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు. దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణ మాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ రైతులను నిండా ముంచిందని దుయ్యబట్టారు.
మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలోలా లేదని అన్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి లోపించిందని అన్నారు. విదేశీ గడ్డపై కాంగ్రెస్ నేతలు వాడుతున్న భాషను చూస్తే బాధేస్తోందని చెప్పారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానపరచడం వంటి దేశ వ్యతిరేక అజెండాతో ముందుకెళుతున్నారని ఆరోపించారు.
తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ వంటి వారితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని అన్నారు. ఇవాళ దేశంలో అత్యంత అవినీతి, నిజాయితీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజ కుటుంబమేనని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీని మించిన వారెవరూ లేరని ప్రధాని ఎద్దేవా చేశారు.
Read More :
Mee Seva | స్తంభించిన ‘మీ’ సేవలు.. పది రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

