Modi resigns as PM | ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. జూన్ 8న మూడోసారి పీఎంగా ప్రమాణం!
Modi resigns as PM | నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. (Modi resigns as PM) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు. జూన్ 8న శనివారం మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా మోదీ నిలువనున్నారు.
కాగా, బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ చివరి సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మంత్రులతో ఆయన చర్చించారు. అనంతరం 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 272. దీంతో జేడీయూ, టీడీపీ, ఇతర పార్టీల భాగస్వామ్యంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి పలు పార్టీల సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

