Mallikarjun Kharge | ఓటర్లను మోదీ రెచ్చగొడుతున్నారు.. ఈసీ చర్యలు తీసుకోవాలి: ఖర్గే
Mallikarjun Kharge | ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం మహారాష్ట్రలోని ముంబైలో ‘ఇండియా’ బ్లాక్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఎన్సీపీ (శరద్) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోదీ ఓటర్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘మేం ఇప్పటి వరకు బుల్డోజర్లు వాడలేదు. ప్రధాని స్వయంగా చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తాం. మేం రాజ్యాంగాన్ని అనుసరిస్తాం’ అని అన్నారు.
కాగా, మహారాష్ట్రలో నిజమైన పార్టీలకు కాకుండా బీజేపీకి మద్దతు ఇచ్చే వర్గాలకు పార్టీ గుర్తులను ఈసీ కేటాయించడాన్ని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ద్రోహం, కుట్రల ఆధారంగా మహారాష్ట్రలో అక్రమంగా ‘మహాయుతి’ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా మద్దతు ఇచ్చారని, ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

