బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం
బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో వరి పంట విస్తీర్ణం తగ్గడం కారణంగా చూపింది
- కేంద్ర ప్రభుత్వ నోటిపికేషన్ విడుదల
- వరి విస్తీర్ణం తగ్గడమే కారణం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో వరి పంట విస్తీర్ణం తగ్గడం కారణంగా చూపింది. స్వదేశీ బియ్యం సరఫరాను మెరుగు పర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
వరిధాన్యం, పాలిష్ చేసిన బియ్యం, పాలిష్ చేయని బ్రౌన్ రైస్‌పై 20 శాతం కస్టమ్స్ సుంకం విధించనున్నట్టు రెవెన్యూ విభాగం జారీచేసిన నోటిఫికేషన్లో తెలియజేశారు. పార్బాయిల్డ్, బాస్మతీ బియ్యానికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. 9వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొన్ని రాష్ర్టాల్లో వర్షాలు పడని కారణంగా మొత్తంగా దేశంలోని వరి విస్తీర్ణం 5.62 శాతం తగ్గి 383.99 లక్షల హెక్టార్లకు పడిపోయిందని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దక్షిణాది ముడిబియ్యం ఎగుమతిపై ప్రభావం పడుతుందని అఖిలభారత బియ్యం ఎగుమతిదార్ల సంఘం అధ్యక్షుడు నథీరాం గుప్తా అన్నారు. పార్బాయిల్డ్ బియ్యం ఎగుమతి మాత్రం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

