రైతులకు బీజేపీ దగా
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్న రైతులకు ఆసరాగా ఉండాల్సింది పోయి, వారిని ముప్పుతిప్పలు పెడుతున్నది
- హర్యానాలో జొన్న రైతులకు చెల్లింపులు లేవు
- కర్ణాటకలో పెసర్ల కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం

చండీగఢ్/బెంగళూరు: డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్న రైతులకు ఆసరాగా ఉండాల్సింది పోయి, వారిని ముప్పుతిప్పలు పెడుతున్నది. బీజేపీ పాలిత హర్యానా, కర్ణాటకలో రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. అటు హర్యానాలో ఇచ్చిన హామీనే తుంగలో తొక్కి వేల మంది జొన్న రైతులకు చెల్లింపులు చేయకుండా మోసం చేస్తున్నది. ఇటు కర్ణాటకలో పెసర్ల కొనుగోలులో ఆలస్యం చేస్తూ రైతులతో ఆడుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాల దగాపై రెండు రాష్ర్టాల్లో రైతులు ఆందోళనల బాటపట్టారు.
2 వారాలుగా చెల్లింపుల్లేవ్..
హర్యానాలోని రోహ్తక్, జజ్జర్, రేవారీ, మహేంద్రగఢ్ జిల్లాలకు చెందిన 11 వేల మంది జొన్న రైతులు హర్యానా స్టేట్ కో ఆపరేటివ్ సైప్లె అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(హెచ్ఏఎఫ్ఈడీ)కు ఈ నెల మొదట్లో తమ పంట అమ్మారు. రెండు వారాలు గడిచినా, ప్రభుత్వం ఇప్పటికీ వారికి చెల్లింపులు చేయలేదు. పంట సేకరించిన 72 గంటల్లోనే డబ్బులు ఇస్తామని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుముందు ఆర్భాటంగా ప్రకటించేసుకొన్నది. కానీ ఇప్పటి వరకు చెల్లింపులే జరగలేదు. కర్ణాటక రైతుల పరిస్థితి మరోలా ఉన్నది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు కారణాలను సాకుగా చూపుతూ పెసర్ల కొనుగోలులో ఆలస్యం చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

