Punjab Congress: కొత్త సీఎంను ఎంపిక చేసేది అధిష్ఠానమే: పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Punjab Congress: పంజాబ్‌లో కొత్త సీఎం ఎవరనే విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి పునరుద్ఘాటించారు.

చండీగఢ్: పంజాబ్‌లో కొత్త సీఎం ఎవరనే విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి పునరుద్ఘాటించారు. నూతన సీఎం ఎంపిక విషయంలో తమ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆమె నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మరోసారి సీఎల్పీ సమావేశం ఏర్పాటుచేసి నాయకుడిని ఎన్నుకుంటామని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ చెప్పారు. అమరీందర్ సింగ్ రాజీనామా చిన్న విషయం కాదని, ఆయన రాజీనామా పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉందన్నారు.
అమరీందర్‌సింగ్ పనితీరుపై తమ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి అసంతృప్తి ఉన్నదని కుల్దీప్ సింగ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న మీడియా ప్రశ్నకు.. అన్నీ అధిష్ఠానంపై ఆధారపడి ఉంటాయని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ చెప్పారు. కొత్త సీఎం ఎంపిక, ఇతర అంశాలపై పూర్తి నిర్ణయాధికారులు అధిష్టానానికే అప్పగిస్తూ శనివారం జరిగిన సీఎల్పీ సామవేశంలో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

