MLA Pooja Pal: నా భర్తను చంపిన గ్యాంగ్‌స్టర్‌ను.. యోగి ఆదిత్యనాథ్ మట్టుబెట్టారు: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే
MLA Pooja Pal: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై .. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసలు కురిపించారు. తన భర్తను చంపిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను.. యోగి ఆదిత్యనాథ్ మట్టుబెట్టారని, దానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై .. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్(MLA Pooja Pal) ప్రశంసలు కురిపించారు. తన భర్తను చంపిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను.. యోగి ఆదిత్యనాథ్ మట్టుబెట్టారని, దానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి న్యాయం అందించారని, తన వేదనను ఎవరూ పట్టించుకోకున్నా.. ఆయన స్పందించారని, రాష్ట్ర రాజకీయాల్లో జీరో టాలరెన్స్ తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. విజన్ డాక్యుమెంట్ 2047పై ఆమె ప్రసంగించారు. తన భర్త రాజ్ పాల్‌ను ఎవరు మర్డర్ చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు అని, తనకు న్యాయం చేసిన సీఎంకు ధన్యవాదులు చెబుతున్నట్లు ఆమె చెప్పారు. అతిక్ అహ్మద్ లాంటి నేరస్తులను చంపి ప్రయాగ్‌రాజ్‌లోని తన లాంటి ఎంతో మంది మహిళలకు సీఎం న్యాయం చేశారని ఎమ్మెల్యే పూజా పాల్ తెలిపారు.
బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజు పాల్‌ను 2005, జనవరి 25వ తేదీన హత్య చేశారు. పూజా పాల్‌ను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఆ మర్డర్ జరిగింది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్తో ఉన్న రాజకీయ విబేధాల వల్ల హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ వెస్ట్ సీటు నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అష్రఫ్‌ను రాజు ఓడించారు. దీంతో రాజును హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ మర్డర్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను ఫిబ్రవరి 2023లో మర్డర్ చేశారు.
ఓ కేసులో అతిక్, అష్రఫ్‌ను అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో మెడికల్ చెకప్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఆ ఇద్దరిపై అటాక్ జరిగింది. పాయింట్ బ్లాంక్ రేంజ్లో అతిక్‌ను కాల్చేశారు. అష్రఫ్‌ను కూడా ఆ స్పాట్లోనే మర్డర్ చేశారు. అతిక్ కుమారుడు అసద్‌ను కూడా ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. మాజీ ఎమ్మెల్యే రాజు మర్డర్ కేసును 2016లో సీబీఐ విచారించింది.
#WATCH | Lucknow, UP | Addressing during the 24-hour marathon discussion on ‘Vision Document 2047’ in the UP Assembly, Samajwadi Party MLA Pooja Pal says, “… Chief Minister Yogi Adityanath gave justice to many women like me by bringing in policies such as zero tolerance that… pic.twitter.com/fN0Agp2nka
— ANI (@ANI) August 14, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

