MK Stalin | మా గళం వినిపించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.. డీలిమిటేషన్పై కేంద్రానికి స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (Delimitation) పై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
MK Stalin : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (Delimitation) పై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు (Tamil Nadu) గళాన్ని వినిపించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
దేశం అభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా..? అని స్టాలిన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణ భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్టాలిన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కుట్రపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు పేరుతో పార్లమెంట్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం తగ్గించేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

