Mitchell Starc: ముగిసిన బుమ్రా శకం.. నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్
Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని అతను ఆక్రమించేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చెలరేగిన బౌలర్ స్టార్క్.. తన కెరీర్లో తొలిసారి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc).. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని అతను ఆక్రమించేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చెలరేగిన స్టార్క్.. తన కెరీర్లో తొలిసారి నెంబర్ వన్ బౌలర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడకపోవడం వల్ల కూడా స్టార్క్‌కు ఆ అంశం కలిసివచ్చింది. బంగ్లాదేశ్‌తో మాకాలో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ పది వికెట్లు తీసి ర్యాంకుల్లో దూసుకెళ్లాడు. అప్పటి వరకు అతను మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. బుమ్రా 2024 ఫిబ్రవరి నుంచి టెస్టు బౌలర్ ర్యాంకుల్లో మొదటి స్థానంలోనే ఉన్నాడు. గడిచిన రెండేళ్ల నుంచి బుమ్రానే దాదాపు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో కొనసాగాడు. కానీ శ్రీలంకతో సిరీస్‌లో గైర్హాజరు వల్ల బుమ్రా ఫస్ట్ ప్లేస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. బుమ్రా, హెన్రీ కన్నా పది పాయింట్ల తేడాతో స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. 697 రోజుల పాటు బుమ్రా నెంబర్ వన్ ర్యాంకులో నిలిచాడు.
A change at the top of the rankings for Test bowlers as an Australian quick claims the No.1 spot for the very first time 😲https://t.co/fvecGLHkbT
— ICC (@ICC) August 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

