QR Code | ఆ QR కోడ్‌ను స్కాన్ చేస్తున్నారా? మీ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చు జాగ్రత్తా?
QR code |
QR Code | చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు పర్సులో లేకున్నా సెల్‌ఫోన్‌తో చెల్లింపులు సులభతరంగా మారాయి. చిన్న కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రస్తుతం ఆన్లైన్ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపు భారీగా పెరిగాయి. టీ కొట్టు నుంచి ఫైవ్‌స్టార్ హోటల్ వరకు.. కిరాణ దుకాణం నుంచి పెద్ద సూపర్ మార్కెట్ల వరకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు సాగుతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ చెల్లింపుల ద్వారా సమయం ఆదా అవుతుంది. అయితే, ఇదే సమయంలో మోసాల బారినపడే ప్రమాదం ఉన్నది.
క్యూఆర్ కోడ్ పేరిట సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకు ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. అందుకే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచించారు. తద్వారా సైబర్ మోసాల బారినపడకుండా కాపాడుకోవచ్చు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కస్టమర్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా, వాలెట్ నుంచి డబ్బులు బెడిట్ అవుతాయి. ఎవరైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత డబ్బులు పంపిస్తామని చెబుతుంటే అది ఫ్రాడ్ అని గమనించి అప్రమత్తంగా ఉండాలి.
కోడ్‌ను స్కాన్ చేసిన సమయంలో యాప్ డౌన్లోడ్ అయ్యేందుకు లింక్ ఇస్తారు.. ఈ లింక్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని, చేస్తే ఫోన్లో స్పైవేర్ డౌన్లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్పైవేర్ డౌన్లోడ్ అయితే ఫోన్లలో ఉన్న రహస్య సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చిక్కుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపొచ్చని.. తీసుకోలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.. డబ్బులు పంపిస్తామని చెబితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

