లక్నో: కొందరు వ్యక్తులు ఒక వృద్ధుడ్ని దారుణంగా చంపారు. బతికున్న అతడ్ని పెద్ద అట్టపెట్టెలో కుక్కారు. ఆ తర్వాత వంతెన పైనుంచి కాలువలో పడేశారు. (Elderly Man Stuffed In Cardboard thrown Into Drain) నీట మునిగిన ఆ వృద్ధుడు మరణించాడు. ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెంట్ హౌస్‌లో ఒక వృద్ధుడు పని చేసేవాడు. డిసెంబర్ నెలలో కొందరు వ్యక్తులు ఆ వృద్ధుడ్ని కిడ్నాప్ చేశారు. ఒక పెద్ద అట్టపెట్టెలో అతడ్ని కుక్కారు. ఒక వాహనంలో వంతెన వద్దకు తరలించారు. అనంతరం అంతా చూస్తుండగా అట్టపెట్టెలో ఉంచిన వృద్ధుడ్ని కాలువలో పడేశారు. ఆ నీటిలో మునిగి ఆయన చనిపోయాడు.
కాగా, తండ్రి కనిపించకపోవడంపై ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. డిసెంబర్ 21న వృద్ధుడి మృతదేహం కాలువలో తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దానిని వెలికి తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఒక వాహనంలో తెచ్చిన పెద్ద అట్టపెట్టెను కాలువలో పడేసిన దృశ్యాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#kanpur बर्रा थाना क्षेत्र में बुजुर्ग को गत्ते में भरकर नाले में फेंकने का गंभीर आरोप। गत्ते फेंकते सीसीटीवी में क़ैद हुए दो युवक।डीसीपी साउथ दफ़्तर के चक्कर लगाएं लेकिन नही दर्ज़ हुआ केस।टेंट हाउस में काम करता था मृतक बुजुर्ग।21 दिसम्बर को लापता बुजुर्ग का नाले में मिला था शव। pic.twitter.com/xj4syL1sQN
— Gaurav Srivastav (@GauravS32967182) January 7, 2024