పొలంలో పడి ఉన్న నవజాత శిశువు.. రాత్రంతా చల్లని, కఠిన వాతావరణాన్ని తట్టుకున్న పసి పాప
ఎవరో కని పడేసిన ఆ శిశువు రాత్రంతా శీతాకాల చలి వాతావరణాన్ని తట్టుకుని జీవించి ఉండటం చూసి సర్పంచ్ రాజ్‌కుమార్ ఆశ్చర్యపోయాడు.
భోపాల్: నవజాత శిశువును ఎవరో పొలాల్లో పడేశారు. అయితే రాత్రంతా చల్లని, కఠినమైన శీతాకా వాతావరణాన్ని ఆ పసి పాప తట్టుకుంది. ఉదయం గ్రామ సర్పంచ్ కంటపటడంతో ఆ శిశువును వెంటనే ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిహాల్‌పూర్ గ్రామ సర్పంచ్ రాజ్‌కుమార్ యాదవ్, బుధవారం ఉదయం కాలినడకన తన పొలానికి వెళ్లాడు. అయితే అక్కడ నవజాత శిశువు పడి ఉండటం చూసి షాకయ్యాడు. పసి పాపను వెంటనే చేతుల్లోకి తీసుకుని తాను కప్పుకున్న శాలువా కప్పాడు.
కాగా, ఎవరో కని పడేసిన ఆ శిశువు రాత్రంతా శీతాకాల చలి వాతావరణాన్ని తట్టుకుని జీవించి ఉండటం చూసి సర్పంచ్ రాజ్‌కుమార్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అలాగే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు. సరైన దారి లేని ఆ పొలం వద్దకు వారు చేరుకున్నారు. పుట్టిన వెంటనే పడేయడంతో పాప శరీరంపై రక్తం ఉంది. అలాగే చలికి ఆ చిన్నారి శరీరం బిగుసుకుపోయింది. దీంతో వెంటనే పాపను వేడి నీటితో స్నానం చేయించారు. 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక నవజాత శిశువు కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.
పసి పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే రాత్రంతా చల్లని చలి వాతావరణంలో పడి ఉండటంతో ఆ శిశువు శరీరం బిగుసుకుపోయిందని, కదలిక చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవజాత శిశువును పుట్టిన వెంటనే పొలం వద్ద పడేసిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. తీవ్రమైన చలిని తట్టుకుని ఆ పాప బతకడం ఆశ్యర్యం కలిగిస్తున్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

