Watch: జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Minor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
చెన్నై: తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. (Minor Boy Drives JCB) అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని మధురైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 17 ఏళ్ల యువకుడు జేసీబీని నడిపాడు. సెల్లూర్ ప్రాంతంలో సుమారు అర కిలోమీటరు దూరం వరకు దానిని డ్రైవ్ చేశాడు.
కాగా, భారీ వాహనమైన జేసీబీపై ఆ యువకుడు నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలపైకి అది వేగంగా దూసుకెళ్లింది. పలు ఆటోలతోపాటు బైకులు, కారు, అక్కడున్న స్థలం వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ షీట్ ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీ గార్డు కూడా గాయపడ్డాడు.
మరోవైపు పెద్ద శబ్దం విన్న స్థానికులు ఏం జరిగిందో తెలియక భయాందోళన చెందారు. జేసీబీ నడిపిన యువకుడ్ని చూసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ యువకుడు జేసీబీపై నియంత్రణ కోల్పోయాడా లేక ఉద్దేశపూర్వకంగా ఆటోలపైకి దూకించాడా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆటోలపైకి జేసీబీ దూసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A 17-year-old boy operated a JCB excavator that was parked at Sellur in #Madurai and damaged several auto rickshaws and properties.
Know more🔗https://t.co/TWug9cLQmo pic.twitter.com/B5aPo0jwHm
— The Times Of India (@timesofindia) March 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

