Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
Rajnath Singh : దేశాన్ని బంగ్లాదేశ్‌లాగా తగులబెట్టేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తో్ందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Rajnath Singh : దేశాన్ని బంగ్లాదేశ్‌లాగా తగులబెట్టేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తో్ందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. యూపీలోని లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సర్ రద్దు చేయాలంటూ, సీఈసీ రాజీనామా చేయాలంటూ ఇండియా బ్లాక్ పార్టీలు ఇటీవల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ అంశంపైనే రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసి, దేశాన్ని తగులబెట్టేలా ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న ప్రతిపక్షాలు అక్కడిలాగా ఇండియాలో కూడా ప్రభుత్వాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్లు ప్రెస్ మీట్లలో బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం దేశ యువతను పావులుగా వాడుకుంటోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, దేశ అభివృద్ధి పథాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యం ఎవరికీ అనుమతి ఇవ్వదు అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ఆయన మద్దతుదారులు గుర్తించాలి.
ఈ అంశంలో సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాల్ని గుర్తించాలి. శాంతి భద్రతల్ని కాపాడాలంటే చట్టాన్ని గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు బలికాకూడదు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలి. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలో క్షమించరాని నేరం. ఆ తర్వాత 1984లో జరిగిన అల్లర్లకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణం. 1990లో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రామ భక్తులు, కరసేవకుల రక్తాన్ని చిందించారు’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

