మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రోడ్లను నటి, ఎంపీ హేమామాలిని బుగ్గలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ”గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ నా నియోజకవర్గానికి విచ్చేయండి. రోడ్లను చూడండి. హేమామాలిని బుగ్గలు గనక వారికి నచ్చకుంటే నేను రాజీనామా చేసేస్తాను.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలి చకన్కర్ స్పందించారు. వెంటనే మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ,లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.