Rahul | గంగలో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్తరు: రాహుల్ ఎద్దేవా
తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు.

తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం అమేథీలో పర్యటించారు. పాదయాత్ర కూడా చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాన్ని తప్పుగా అమలు చేయడం, కరోనా క్లిష్ట సమయంలో మొండి చేయి చూపడం… వీటి వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం అతలాకుతలమైందని ఆరోపించారు. వీటివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నా, ప్రధాని మోదీ మాత్రం దానిపై నోరు విప్పరని, వారణాసిలోని గంగానదిలో మాత్రం మునుగుతారని దెప్పిపొడిచారు.
హిందుత్వ వాదుల వల్లే దేశంలో కష్టాలున్నాయని మండిపడ్డారు. హిందువులు, హిందూవాదుల మధ్యే యుద్ధం నడుస్తోందని పునరుద్ఘాటించారు. హిందువులు సత్యాన్ని నమ్ముకుంటే, హిందూవాదులు మాత్రం అధికారాన్నే పరమావధిగా భావిస్తారని బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. చైనా భారత భూభాగాన్ని లాక్కున్నా, ప్రధాని మోదీ మాత్రం కిమ్మనరని, పైగా చైనా తీసుకోలేదని ప్రజలను బుకాయిస్తారని తీవ్రంగా ధ్వజమెత్తారు. నూతన సాగు చట్టాలు ప్రజల మేలు కోసమే అంటూ నమ్మించారని, ఆ తర్వాత ప్రజలను క్షమాపణలు కోరుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అమేథీ ప్రజలు రాజకీయాల విషయంలో తనకు చాలా విషయాలు నేర్పారని, అమేథీ నుంచే మొట్ట మొదటి సారిగా ఎన్నికల గోదాలోకి దిగినట్లు రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రెండేళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి రాహుల్
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేధీలో అడుగుపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అమేధీ, వయనాడ్ రెండు చోట్ల నుంచీ బరిలోకి దిగారు. అమేధీలో ఘోర ఓటమిని చవి చూశారు. ప్రత్యర్థి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వయనాడ్ నుంచి మాత్రం బంపర్ ఓట్లతో విజయం సాధించారు. అప్పటి నుంచి రాహుల్ అమేధీ మొహం కూడా చూడలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాజాగా అమేధీలో పర్యటిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

