బెంగాల్ హింస : రాష్ట్రానికి చేరుకున్న హోంమంత్రిత్వ శాఖ నిజ నిర్ధారణ బృందం

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ బృందం అసెంబ్లీ ఎన్నికల అనంతరం వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాకాండకు దారితీసిన పరిస్థితులను అథ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్ధాయి పరిస్థితిని మదింపు చేయనుంది. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం బెంగాల్ లో పర్యటించనుంది.
మరోవైపు ఎన్నికల అనంతర హింసపై తక్షణమే సమగ్ర నివేదికను పంపాలని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సత్వరమే నివేదికను పంపని పక్షంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాగా బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో మంగళవారం నాటికి ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఇక టీఎంసీ గూండాలు తమ కార్యకర్తలతో పాటు మహిళా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

