బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 14:39:16

రుతుస్రావ ప‌రీక్ష‌లు.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించిన సీఎం

రుతుస్రావ ప‌రీక్ష‌లు.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించిన సీఎం

హైద‌రాబాద్‌: గుజ‌రాత్‌లో  ఓ మ‌హిళా డిగ్రీ కాలేజీలో 68 మంది మ‌హిళా విద్యార్థునుల‌కు రుతుస్రావ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ఘ‌ట‌న‌పై ఆ రాష్ట్ర సీఎం విజ‌య్ రూపానీ స్పందించారు.  బుజ్‌లో జ‌రిగిన ఆ ఘ‌ట‌నను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుందన్నారు.  ఈ ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోంశాఖ‌కు, విద్యాశాఖ‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు సీఎం రూపానీ తెలిపారు.  ప్ర‌ముఖ స్వామినారాయ‌న్ మందిర్ యాజ‌మాన్యం నిర్వ‌హిస్తున్న శ్రీ స‌హ‌జానంద మ‌హిళా విద్యాసంస్థ‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.  దాదాపు 1500 మంది విద్యార్థినులు ఆ కాలేజీలో చ‌దువుతున్నారు. వీరిలో 68 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కాలేజీలో ఉన్న హాస్ట‌ల్‌లో వ‌స‌తి పొందుతున్నారు. ఈ కాలేజీలోని విద్యార్థినులు రుతుస్రావ స‌మ‌యంలో వంట‌గ‌దిలోకి వెళ్ల‌కూడ‌ద‌ని, క‌నీసం తోటి విద్యార్థినుల‌ను ముట్టుకోవ‌ద్దంటూ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. logo
>>>>>>