Himalaya M Shangpliang | మేఘాలయాలో బీజేపీకి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
Himalaya M Shangpliang | మేఘాలయాలో బీజేపీ (BJP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హిమాలయా ఎం షాంగ్లియాంగ్ బీజేపీకి రాజీనామా చేసి.. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లో చేరేందుకు సిద్ధమయ్యారు.
షిల్లాంగ్: మేఘాలయాలో బీజేపీ (BJP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హిమాలయా ఎం షాంగ్లియాంగ్ బీజేపీకి రాజీనామా చేసి.. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. సెప్టెంబర్ 13న NPPలో చేరనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 13న NPP హెడ్‌క్వార్టర్స్‌లో ఆ పార్టీలో చేరనున్నట్లు షాంగ్లియాంగ్ తెలిపారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మీరు షిల్లాంగ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను ఎలాంటి షరతులు విధించకుండా NPPలో చేరుతున్నానని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కాన్రాడ్ సంగ్మా చేసిన అభివృద్ధి పనులను చూసే తాను NPPలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

