పొత్తు మాటే లేదు.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి
ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

లక్నో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె కొట్టిపరేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.
కాగా, పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ శిరోమణి అకాలీదళ్ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 117 సీట్లలో అకాలీదళ్ 97 స్థానాల్లో, బీఎస్పీ 20 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

