Mayawati | కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారుల నేమ్‌ప్లేట్స్ ప్రదర్శన : యూపీ నిర్ణయంపై మాయావతి ఫైర్
Mayawati : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాల యజమానుల నేమ్‌ప్లేట్స్ ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వ నిర్ణయంపై బీఎస్పీ చీఫ్ మాయావతి భగ్గుమన్నారు.
Mayawati : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాల యజమానుల నేమ్‌ప్లేట్స్ ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వ నిర్ణయంపై బీఎస్పీ చీఫ్ మాయావతి భగ్గుమన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల నిర్ణయాలను ఆమె ఎక్స్ వేదికగా తప్పుపట్టారు. కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని, ఎన్నికల్లో ప్రయోజనాల కోసం మాంసం విక్రయాలను నిషేధించాలని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మాయావతి ట్వీట్ చేశారు.
ఓ వర్గానికి చెందిన వారిని ఇలా ఆర్ధిక బహిష్కరణ చేయడమనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని ఆ పోస్ట్‌లో బీఎస్పీ చీఫ్ రాసుకొచ్చారు. మరోవైపు యూపీ సర్కార్ చర్యను బీజేపీ పేత, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ స్వాగతించారు. ప్రజల్లో పరస్పర శాంతి సామరస్యం వెల్లివిరిసేందుకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
రాజ్యాంగ వ్యవస్ధలో పొందుపరిచిన మత విశ్వాసాలను గౌరవించడం, కాపాడటానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు, పండుగలు, కన్వర్ యాత్ర వంటి కార్యక్రమాలకు నిబంధనలను ఉల్లంఘించరాదని ఈ ఉద్దేశంతో తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నామని దినేష్ శర్మ అన్నారు. హిందూ, ముస్లింల మధ్య సామరస్యంపై ఈ చర్యలు ఎలాంటి ప్రభావం చూపబోవని ఆయన స్పష్టం చేశారు.
Read More :
Brain Stroke | డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

