Brain Stroke | డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
- రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది
- అప్రమత్తత అవసరం: వైద్య నిపుణులు
Brain Stroke | న్యూఢిల్లీ, జూలై 18: దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. ఇన్ఫెక్షన్ సోకిన మొదటి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు. సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు.
డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌గా పేర్కొనే తీవ్రమైన ప్లాస్మా లీకేజీ వల్ల మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని, ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్ ముప్పు ఉంటుందని న్యూరాలజిస్ట్ డాక్టర్ లోమేశ్ భిరుడ్ తెలిపారు. డెంగ్యూ వైరస్ కొన్నిసార్లు నరాల కణాలను ఆక్రమించి పనితీరును దెబ్బతీస్తుందని చెప్పారు. మెదడు, వెన్నెముకలో వాపు ఏర్పడి కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

