Mayawati | లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : మాయావతి
Mayawati | లోక్‌సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు.
Mayawati | లోక్‌సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మాయావతి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో, బలంతో ఎన్నికల్లో పోరాడుతోందని మాయావతి స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కూటమి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పుకార్లపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదని.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బహుజనుల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీఎస్పీ దృఢ నిర్ణయం తీసుకుందన్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి ప్రకటించారు. కూటముల్లో చేరేందుకు నిరాకరించారు. ఎన్నికల కోసం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, ఆమె ఇండియా కూటమిలో చేరనున్నారనే ఊహాగానాలున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

