Fire accident | ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. Video
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Fire accident : మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలో ఈడీ కార్యాలయం ఉన్న కైసర్-ఐ-హింద్ (Kaiser I Hind) భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.31 గంటల సమయంలో బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం 12 ఫైరింజన్లు, జెట్టీలు, వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. అగ్నికీలకు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ టీమ్స్ కొన్ని గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని పలు దస్త్రాలు కాలిపోయాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
#WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai’s ED office in Ballard Pier.
The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8
— ANI (@ANI) April 27, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

