Fire Breaks Out in Temple | పురాతన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. దెబ్బతిన్న విగ్రహాలు
Fire Breaks Out in Temple | వందల ఏళ్ల నాటి పురాతన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలకు ఆ గుడి మొత్తం కాలిపోయింది. ఆలయంలోని దేవుడి విగ్రహాలు కాలి దెబ్బతిన్నాయి. గ్రామస్తులతోపాటు ఫైర్ సిబ్బంది పలు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు.
భోపాల్: వందల ఏళ్ల నాటి పురాతన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Fire Breaks Out in Temple) మంటలకు ఆ గుడి మొత్తం కాలిపోయింది. ఆలయంలోని దేవుడి విగ్రహాలు కాలి దెబ్బతిన్నాయి. గ్రామస్తులతోపాటు ఫైర్ సిబ్బంది పలు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భామ్‌గఢ్ గ్రామంలో 500 ఏళ్ల కిందట రాజులు నిర్మించిన రామాలయం ఉంది. శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆ ఆలయంలో మంటలు వ్యాపించాయి. గమనించిన గ్రామస్తులు పూజారిని నిద్రలేపి ఈ విషయం చెప్పారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కాగా, చెక్కతో నిర్మించిన ఆ గుడి అంతా మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఖాండ్వా నుంచి రెండు, హర్సూద్ నుంచి ఒక అగ్నిమాపక వాహనాలతో వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే మంటలకు ఆలయం పూర్తిగా కాలిపోయింది. అలాగే అందులోని దేవుడి విగ్రహాలు కూడా దెబ్బతిన్నాయి.
మరోవైపు ఆలయంలో వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గుడి వెనుక చెత్త కుప్పల నుంచి మంటలు చెలరేగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇతర వర్గాల వారు అక్కడ చెత్తపోయడంపై వివాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిలో అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

