ఉద్యోగాల ఊచకోత.. భారత టెకీల్లో మొదలైన కలవరం
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించినా, దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.
- మాంద్యం ప్రభావమేఅంటున్న నిపుణులు
- ట్విట్టర్లో ట్రెండింగ్‌గా లేఆఫ్ హ్యాష్‌ట్యాగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించినా, దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా భారత్‌లోని టెక్ కంపెనీల్లో నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఇదంతా గత రెండేండ్ల కాలంలో జరిగిన పరిణామాలు. అయితే ఆర్థిక మాంద్యం సంకేతంతో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు పక్రియ మొదలైంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తుండటం తీవ్ర కలవరం రేపుతున్నది. మైక్రోసాఫ్ట్ 10 వేలు, అమెజాన్ 18 వేలు, గూగుల్ 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టగా.. 452 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా విప్రో కూడా ప్రకటించింది. బడా కంపెనీలే ఈ తొలగింపు చేపట్టడంతో దీనికి ఆర్థిక మాంద్యం కారణమనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణుడు డీ పాపారావు వ్యక్తం చేశారు.
అన్ని రంగాలపై మాంద్యం ప్రభావం
‘ఆర్థిక మాంద్యం ప్రభావం ఒక్క ఐటీపైనే కాదు అన్ని రంగాలపైనా ఉంటుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుంది. ఉన్న దాన్ని భద్రంగా దాచుకొని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంటుంది’ అని పాపారావు వివరించారు. కరోనా దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు విలవిలలాడాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రభావం ఉన్నది. భారత్ ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవలి అంచనాల ప్రకారం మన దేశ జీడీపీ వృద్ధి -7.3% గా నమోదైంది. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో ఉన్నామని స్పష్టమవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
గాడిలో పెట్టడం చాలా కష్టం
ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకొంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. ఆర్థిక మాంద్యం సాధారణంగా 3-4 ఏండ్లు కొనసాగుతుంది. దీంతో ఓ దేశ జీడీపీ 10% మేర కుంగుబాటుకు లోనవుతుంది. మాంద్యం నిరుద్యోగం, పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ప్రాంతానికో, ఒక నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుంది.
ట్విట్టర్లో లేఆఫ్ ట్రెండింగ్
లేఆఫ్2023(#layoffs2023) హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. ప్రపంచ దిగ్గజ కంపెనీలే జనవరి నెలలో వేల ఉద్యోగులను తొలగించాయంటూ పలువురు గణాంకాలతో ట్వీట్ చేశారు. ఇందులో 2023 జనవరిలోనే 70 వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

