Maoist RK | మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత
Maoist RK | మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.

maoist rk aka Akkiraju Haragopal | మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూశారు. కొంతకాలంగా దక్షిణ బస్తర్ అడవుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. పెరాలసిస్, లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఆయన మరణించినట్లు సమాచారం. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ధ్రువీకరించారు.
ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ ( Akkiraju Haragopal ). ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమ నేతగా మారిన సమయంలోనే తన పేరును రామకృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ తర్వాత విప్లవోద్యమంలో అగ్రనేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏపీ ఒడిశా సరిహద్దు ఇన్చార్జిగా కూడా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయన.. వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బయటకు వచ్చారు. 2004 అక్టోబర్ 15న వైఎస్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు.

2003లో అలిపిరి వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి వెనుక కూడా ఆర్కే కీలక సూత్రధారి. చంద్రబాబు, ఎస్పీ లడ్డాపై దాడి కేసు సహా దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దాదాపు 85 కేసుల్లో ఆర్కే నిందితుడు. ఈయనపై 200 మంది పోలీసుల ఎన్కౌంటర్ కేసులు ఉన్నాయి. ఆర్కేపై దాదాపు రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. ఉద్యమ సమయంలో పలుమార్లు ఆర్కే ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మరణించాడు. అదే ఎన్కౌంటర్లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. అప్పటి నుంచి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆర్కే కోలుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆర్కే అనారోగ్యంతో మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ ధ్రువీకరించారు. అయితే ఆర్కే మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని విరసం నేత కల్యాణ్ రావు చెబుతున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆమె టీచర్‌గా పనిచేశారు. ఆమెపై కూడా పలు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచర్‌గా పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
23 మంది తమిళ మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
AP CM Jagan on Coal | బొగ్గు కొనుగోలు. ఏపీ సీఎం జగన్ ఏం చెప్పారంటే!
వంద కోట్ల డోసుల మార్క్‌పై కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు.. విమానాలు, రైళ్లలో ఎనౌన్స్‌మెంట్లు
ఇది ఫేస్బుక్ రహస్య బ్లాక్‌లిస్ట్.. బహిర్గతం చేసిన ఓ వెబ్సైట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chhattisgarh
- Maoist
- Maoist RK
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

