మరాఠా ఉద్యమం అణచివేతకు రూ.500 కోట్లు!
తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను బయటపెట్టే ఒక ఆడియో క్లిప్‌ను మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ గురువారం విడుదల చేశారు.
- ఏక్నాథ్ షిండే ద్వారా బీజేపీ కుట్రలు
- ఆడియో క్లిప్ బయటపెట్టిన మనోజ్ జరాంగే
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను బయటపెట్టే ఒక ఆడియో క్లిప్‌ను మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ గురువారం విడుదల చేశారు. ఇందులో ఒక మహిళ మాట్లాడుతూ 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరాంగే పాటిల్‌ను, మరాఠా సమాజాన్ని బుజ్జగించేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు బీజేపీ రూ.500 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన అధినేతగా కొనసాగుతూ బీజేపీకి కీలక మిత్రుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి షిండే ఈ ఆరోపణలను ఖండించారు.
పాటిల్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో మరాఠా రిజర్వేషన్ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి, జరాంగే పాటిల్ నోరు మూయించడానికి షిండే కుమారుడు, లోక్‌సభ ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ షిండే ద్వారా బీజేపీ జరాంగే పాటిల్‌కు రూ.500 కోట్లు చెల్లించిందని ఒక మహిళ ఆరోపించారు. అయితే, తనకు ఎటువంటి డబ్బు అందలేదని, అలాగే తన ఉద్యమాన్ని వదులుకోవడానికీ అంగీకరించలేదని పాటిల్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, విచారణ జరిగేలా చూడాలని ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. కాగా ఈ ఆరోపణలను తిరస్కరించిన ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తాను ఏ విధమైన విచారణకైనా సిద్ధమని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

