Manmohan Singh | సంస్కరణల సారధి.. ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలందించిన నేత
Manmohan Singh | దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ.. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జవ సత్వాలు కల్పించారు.
Manmohan Singh | యావత్ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్న వేళ.. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అప్పటి ప్రధాని పీవీ నర్సింహరావు, తన క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను తీసుకున్నారు. విపక్షాల నుంచి, కాంగ్రెస్ పార్టీలోని నేతల నుంచి విమర్శలు వచ్చినా ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల అమలుతో దేశ రూపురేఖలే మారిపోయాయి. ఆర్థిక సంస్కరణల అమలుతో 1996 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్, 1998-2004 మధ్య బీజేపీ నేత వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగింది.
తిరిగి 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నది. మిత్రపక్షాల మద్దతుతో ఏర్పాటైన యూపీఏ కూటమి తొలి విడుత ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఐదేండ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత రెండోసారి ప్రధానిగా నియమితులైన కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్. 2009లో యూపీఏ కూటమి మరింత మెజారిటీ సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ 2009లో పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి 2014 వరకూ ప్రధానిగా పదేండ్ల పాటు కొనసాగారు.
యూపీఏ ప్రభుత్వ సారధిగా మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, పౌరులందరికీ గుర్తింపు కార్డు ఆధార్ జారీ చేసేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించినా 2008లో అమెరికాతో చారిత్రక పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. 1991లో దేశ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 వరకూ అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

