Manish Tewari : కాంగ్రెస్‌లో సంక్షోభానికి అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసిన మనీష్ తివారీ!

న్యూఢిల్లీ : అసోం, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ హరీష్ రావత్ ట్వీట్ పార్టీలో దుమారం రేపిన నేపధ్యంలో మనీష్ తివారీ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తప్పుపట్టారు. అసోం, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభంతో ఉత్తరాఖండ్ పరిణామాలను మనీష్ తివారీ పోల్చారు.
అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ 2014 జులైలో అప్పటి సీఎం తరుణ్ గగోయ్‌తో పాటు పార్టీ నాయకత్వంతో విభేదించి కాషాయ పార్టీలో చేరారు. తనకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శర్మ ప్రకటించినా సీఎంను చేసేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఇక పంజాబ్ సీఎంగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలతో ఆ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో జట్టు కట్టారు.
పార్టీ సీనియర్ నేతల నడుమ తలెత్తే విభేదాలు బహిర్గతమైనా వాటిని పరిష్కరించడంలో అగ్రనాయకత్వం విఫలమవడంతోనే ఆయా నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు కనిపిస్తోందని మనీష్ తివారీ ట్వీట్ చేశారు. మనీష్ తివారీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
Varanasi | వారణాసి ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ రూ.500 కోట్లా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

