Arvind Kejriwal | ప్రధాని మోదీ సిగ్గు పడాలి.. సిసోడియా అరెస్ట్‌పై ఢిల్లీ సీఎం కేజ్రివాల్
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియాను అవినీతి కేసులో జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయ్‌పూర్: ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియాను జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీశ్ సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపినవాళ్లు, కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. అందుకు ప్రధాని మోదీ సిగ్గుపడాలని మండిపడ్డారు.
త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నేతలు తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ ఆప్ చీఫ్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాయచూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేజ్రివాల్ మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

