Manipur Violence | రాత్రంతా బుల్లెట్ల శబ్దాలే.. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన
Manipur Violence | ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్‌లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ గ్రామ వాసి చేసిన వ్యాఖ్యలివి. మణిపూర్‌లో తాజా పరిస్థితులకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
Manipur Violence | ఇంఫాల్, జూలై 27: ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్‌లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ గ్రామ వాసి చేసిన వ్యాఖ్యలివి. మణిపూర్‌లో తాజా పరిస్థితులకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మహిళలపై దారుణ ఘటన వెలుగు చూసినప్పటికీ బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిని నెలకొల్పేందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తున్నది.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరోసారి చోటుచేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో గురువారం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రెండు గ్రూపులకు చెందిన కొంతమంది మిలిటెంట్లు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మిలిటెంట్లను చెదరగొట్టారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 50 కి.మీ దూరంలోని ఫౌబాక్‌చావో ఇకాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో భాగంగా మిలిటెంట్లు ఓ ఇంటిని తగలబెట్టారు. దీంతో స్థానికులు తమ ఇండ్లను విడిచిపెట్టి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.

Manipur
భావ వ్యక్తీకరణపై క్రిమినల్ కేసులా?
భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ దేశ పౌరులకు లేదా? అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే క్రిమినల్ కేసులు పెడతారా? అంటూ మేధావి వర్గం మండిపడింది. మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్ర విధ్వంస పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ సుయాన్ హాసింగ్‌పై క్రిమినల్ కేసు పెట్టడాన్ని దేశ, విదేశాలకు చెందిన 32 మంది విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వారు ప్రకటన చేస్తూ ఇది రాజ్యాంగం కల్పించిన వాక్స్వాతంత్య్ర హక్కును హరించే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు.
ఇటీవల మణిపూర్‌లో చోటుచేసుకున్న అకృత్యాలపై ప్రొఫెసర్ హాసింగ్ ‘వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీయడమే కాక ఒక వర్గం వారికి అనుకూలంగా ఉన్నాయని ఆషెం తరుణకుమారి దేవీమైతీ ట్రైబ్స్ యూనియన్ (ఎంటీయూ) సభ్యుడు మణిహార్ మొయిరంగథమ్ సింగ్ ఫిర్యాదు చేయడంతో హాసంగ్‌కు ఈ నెల 6న ఇంఫాల్ తూర్పు జిల్లా కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. హాసంగ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు వ్యక్తులు క్రిమినల్ కేసు దాఖలు చేయడం దురదృష్టకరమని, ఇది చాలా ప్రమాదకర ధోరణని వారు వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

