మణిపూర్‌లో రెండో దశ పోలింగ్ .. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి
Manipur polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ్టితో కలిపి
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ్టితో కలిపి రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. ఇక మణిపూర్‌లో రెండు దశలకుగాను ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగియగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. అయితే పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చోట్ల ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే 38 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరిగింది. ఇవాళ 22 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 92 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో దశ పోలింగ్ కోసం అధికారులు మొత్తం 1247 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
మొత్తం 22 స్థానాల్లో అధికార బీజేపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ 18 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 11 స్థానాల్లో, జేడీయూ-నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి 10 స్థానాల్లో పోటీపడుతున్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులు 12 స్థానాల్లో బరిలో దిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

