న్యూఢిల్లీ : చెట్టుపై కూర్చుని డోనట్ తింటున్నఉడతను ఓ వ్యక్తి గమనించి తన మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. చెట్టుపై కూర్చున్న ఉడత భారీ డోనట్‌ను తింటున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ హాగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 25,000కుపైగా వ్యూస్ లభించాయి.
ఈ వీడియోలో చెట్టుపైన కూర్చుని డోనట్ తింటున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇప్పటివరకూ ఎలుకలు పలు నట్స్ తింటుండటం చూసినా ఇలాంటి దృశ్యం మాత్రం అరుదైనదే అని చెప్పుకోవచ్చు.
ఈ ఉడత రాత్రికి మేలైన ఆహారం తీసుకుంటోదని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. డోనట్లో ఉండే షుగర్‌తో వారం రోజుల వరకూ దీనికి ఆహారం అవసరం లేదని ఓ యూజర్ రాసుకొచ్చారు. జంతు ప్రపంచానికి చెందిన వీడియోలు అమూల్యమని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :