టీకా మిస్ అయినా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్!

ముంబై : కొవిన్ పోర్టల్‌లో లోటుపాట్లు బహిర్గతమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ముంబై విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొవిన్ ప్లాట్‌ఫాం నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వచ్చింది. కొవిన్ యాప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్న నిలేష్ మేస్త్రీ అనే వ్యక్తి వేరే పనులు ఉండటంతో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లలేదు. ఇప్పుడు ఏకంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ రావడంతో తనకు వ్యాక్సిన్ వేస్తారో లేదో అని ఆయన భయపడుతున్నాడు. వ్యాక్సిన్ వేయించుకోకుండానే వ్యాక్సినేషన్ సర్టిపికెట్ రావడంతో మేస్త్రీ చార్కోప్ పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిలేష్ మేస్త్రీ జులై 15న ఖండివలిలోని చవాన్ ఆస్పత్రిలో కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్నాడు. తాను అపాయింట్మెంట్ను మిస్ చేసినా ఆన్లైన్లో సర్టిఫికెట్ జనరేట్ అయిందని మేస్త్రీ వాపోయాడు. ఇక మేస్త్రి అసలు ఆస్పత్రికే వెళ్లలేదని, అయినా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై అతడి వివరాలు ఎలా వచ్చాయని ఎంఎన్ఎస్ కార్యకర్త దినేష్ సాల్వి ప్రశ్నించారు. దీనిపై బాధితుడితో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

