Chowmein Golgappa | గోల్గప్పా దాన్నే పానీపూరీ అని కూడా అంటాం. పానీపూరీ పేరు వింటేనే నోరు ఊరుతుంది. పానీపూరీలో చాలా రకాలు ఉంటాయి. మీటా పానీపూరీ.. స్పైసీ పానీపూరీ.. కొన్ని రాష్ట్రాల్లో రకరకాలుగా పానీపూరీని తయారు చేస్తుంటారు. అయితే.. పానీపూరీతో ఈ మధ్య వెరైటీ వంటకాలను చేస్తున్నారు. ఇటీవల పానీపూరీ ఐస్‌క్రీమ్‌ను తిన్నాం గుర్తుందా? తాజాగా చౌమేన్ గోల్‌గప్పాను తయారు చేశారు.
చౌమేన్ అంటే ఏంలేదు.. నూడుల్స్‌తో చేసే వంటకం.. దాన్ని గోల్గప్పాతో కలిసి తినడం అన్నమాట. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబోయ్ ఇలాంటి పానీపూరీ కూడా ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వెరైటీ పానీపూరీని లక్నోలో చెఫ్ కంది అనే వ్యక్తి తయారు చేశాడు. ముందు గోల్గప్పాలను రెడీ చేసి ఆ తర్వాత నూడుల్స్ తయారు చేసి దాని మీద పెరుగు, టూటీ ఫ్రూటీ, కొత్తిమీర, సన్నగా తరిమిన కొబ్బరి వేసి.. గ్రీన్, రెడ్ చట్నీతో గోల్‌గప్పాను తినాలన్నమాట.