Sardar 2 | ‘నాకే ప్లాస్టిక్ వాటర్ బాటిలా ఇస్తారా?’ ‘సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో ఎస్జే సూర్య కామెడీ టైమింగ్!
S.J. Suryah | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సర్ధార్'కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'సర్ధార్ 2'. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
S.J. Suryah | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సర్ధార్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘సర్ధార్ 2’. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన ప్రముఖ నటుడు ఎస్జే సూర్యకు మీడియా సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అందించారు. దీనిని గమనించిన ఎస్జే సూర్య తనదైన శైలిలో స్పందిస్తూ.. “నాకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇస్తావా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు పూశాయి. వెంటనే అప్రమత్తమైన హీరో కార్తీ, పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను ఎస్జే సూర్యకు అందించి పరిస్థితిని సర్దుబాటు చేశారు.
కాగా, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వల్ల ఆరోగ్యం ఏవిధంగా పాడవుతుందనే పాయింట్ చుట్టూనే ‘సర్ధార్’ సినిమా కథ నడుస్తుందన్న విషయం తెలిసిందే. సినిమాలోని ఈ కాన్సెప్ట్‌ను గుర్తుచేస్తూ జరిగిన ఈ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
When given WATER to SJSuryah in PLASTIC BOTTLE:#Karthi: Adhu Plastic Bottle Venam….#SJSuryah: Enga Vandhu, Plastic Bottle kudukaringa…#Sardar2 daaaa👊 pic.twitter.com/OMvdgWRS9W
— AmuthaBharathi (@CinemaWithAB) August 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

