బర్రెను వెతికేందుకు వెళ్లి ఎలుగు దాడిలో వ్యక్తి మృతి
Bear attack: తప్పిపోయిన బర్రెను వెతికేందుకు వెళ్లి ఓ వ్యక్తి ఎలుగుబంటి దాడిలో మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా టైగర్ రిజర్వ్ ఏరియాలోగల

భోపాల్: తప్పిపోయిన బర్రెను వెతికేందుకు వెళ్లి ఓ వ్యక్తి ఎలుగుబంటి దాడిలో మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా టైగర్ రిజర్వ్ ఏరియాలోగల బగోహా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బగోహా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా మేత కోసం తన బర్రెను వదిలేశాడు. అయితే, ఎప్పుడైనా సాయంత్రం ఇల్లు చేరే బర్రె ఆరోజు తిరిగిరాలేదు. దాంతో బర్రెను వెతకడం కోసం సమీప అడవిలోకి వెళ్లాడు.
రాత్రయినా బర్రె కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఫీల్డ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో గాలించగా తప్పిపోయిన వ్యక్తి శవమై కనిపించాడు. అతని ఒంటిపై ఏదో జంతువు దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దాంతో అతను పులిదాడిలో మరణించాడని స్థానికులు భావించారు. కానీ మృతుడి ఒంటిపై ఉన్న గాయాలను బట్టి అతను ఎలుగుబంటి దాడిలో మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

