లక్నో: ఒక కారుపై పడవ ఉంది. ఆ పడవలో ఎమ్మెల్యే ఉన్నారు. జలమయమైన నగర రోడ్ల సమస్యపై ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. చిన్నపాటి వర్షానికే కాన్పూర్‌లోని రోడ్లు జలమయమవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 22న నీట మునిగిన అండర్ పాస్ వంతెన కింద నుంచి బైక్‌పై వెళ్తున్న డెలివరీ వ్యక్తి చరణ్ సింగ్ అక్కడి నీటిలో మునిగిపోయాడు. ఆ తర్వాత రోజు అతడి మృతదేహంతోపాటు బైక్‌ను వెలికితీశారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఆర్యానగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఎస్‌యూవీపై ఉన్న బోటులో తెడ్డుపట్టుకుని కూర్చొన్నారు. కారుపై అలా ప్రయాణించి జనాన్ని ఆకట్టుకున్నారు. జలమయమైన కాన్పూర్ రోడ్ల సమస్యను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే నీటితో నిండిన రోడ్లపై వెళ్లేందుకు బోట్లు, సెఫ్టీ జాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం, కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిపై మండిపడ్డారు.
మరోవైపు కారుపై బోటు ఉంచి అందులో ప్రయాణించి వినూత్నంగా నిరసన తెలిపిన ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాన్పూర్ సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ ఎమ్మెల్యే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపించారు. రూ.2,000 చలానా కూడా విధించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా రుసుమును శనివారం చెల్లించినట్లు ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ తెలిపారు.
कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले
नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023