mass suicide | గోవాలో వ్యక్తి మృతదేహం.. భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలో లభ్యం
mass suicide | ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్‌లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పనాజీ: ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్‌లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని చికాలిమ్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల శ్యామ్ పాటిల్ లేబర్ కాంట్రాక్టర్. గురువారం దక్షిణ గోవాలోని క్యూపెమ్ అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకు పాటిల్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అదే రోజు కర్ణాటకలోని కార్వార్లో ఉన్న దేవ్‌బాగ్ బీచ్‌లో 37 ఏళ్ల భార్య జ్యోతి, 12 ఏళ్ల కుమారుడి మృతదేహాలు లభించాయి. కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, లేబర్ కాంటాక్టర్ అయిన శ్యామ్ పాటిల్ పలు బ్యాంకులతోపాటు పలువురి నుంచి భారీగా అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పుల బాధలు తాళలేక అతడి కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆ కుటుంబం గోవా నుంచి పొరుగున్న ఉన్న కర్ణాటకలోని కార్వార్కు వెళ్లినట్లు పొరుగింటి వారి ద్వారా తెలిసిందన్నారు.
మరోవైపు తన భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని, తాను కూడా జీవితాన్ని ముగిస్తున్నట్లు తన స్నేహితుడికి శ్యామ్ పాటిల్ వాయిస్ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసిన సూసైడ్ నోట్ పాటిల్ కారులో లభించినట్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

