Viral Video: భార్యను పంపని అత్తమామలు… హై టెన్షన్ టవర్ ఎక్కి భర్త నిరసన
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు.
రాయపూర్: పుట్టింటికి వెళ్లిన భార్యను పంపేందుకు అత్తమామలు నిరాకరించారు. దీంతో ఒక వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగి వచ్చాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భిలాయ్‌లోని గనియారి గ్రామంలో పుట్టింట్లో ఉంటున్న భార్య వద్దకు ఆమె భర్త హోరీ లాల్ వెళ్లాడు. భార్యను తనతో పంపాలని అత్తమామలను కోరాడు. అయితే వారు దానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి గ్రామంలో ఉన్న 75 అడుగుల పొడవైన హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్యను తనతో పంపాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు. అయితే భార్యను అతడితో పంపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అతడు ఆ హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. అనంతరం పోలీసులు హోరి లాల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడి అత్తమామలను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే కుమార్తెను అల్లుడి ఇంటికి పంపేందుకు వారు ఎందుకు నిరాకరించారో అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. ఈ సంఘటన షోలే సినిమాను గుర్తు చేసిందని కొందరు తెలిపారు. ఈ సినిమాలో ధర్మేంద్ర మాదిరిగా ఆ భర్త హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడని పేర్కొన్నారు.
पत्नी को लेने ससुराल पहुंचा था युवक ससुराल वालों ने नहीं भेजा तो पति बन गया शोले फिल्म का धर्मेंद्र और चढ़ गया हाईटेंशन टावर पर.. pic.twitter.com/jXyPJx1pua
— alkesh kushwaha (@alkesh_kushwaha) September 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

