Grenade Attack | అమృత్సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
Grenade Attack | అమృత్సర్ (Amritsar)లోని ఓ ఆలయంపై ఇటీవలే జరిగిన గ్రెనేడ్ దాడి (Grenade Attack) ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మృతి చెందాడు.
Grenade Attack | అమృత్సర్ (Amritsar)లోని ఓ ఆలయంపై ఇటీవలే జరిగిన గ్రెనేడ్ దాడి (Grenade Attack) ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మృతి చెందాడు. గుర్సిదక్ సింగ్ అనే అనుమానితుడు పంజాబ్ పోలీసుల (Punjab Police) ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మరో నిందితుడు తప్పించుకున్నాడు.
అమృత్సర్లోని ఓ గుడిపై గ్రెనేడ్ దాడి (Grenade Attack) జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. పేలుడు వల్ల ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. అర్థరాత్రి గ్రెనేడ్ దాడి జరిగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా నిర్ధరించిన పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు రాజసాన్సీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సీఐఏ, ఛెహర్తా పోలీసులతో కూడిన బృందం ఆ ప్రాంతంలో వారి కోసం గాలింపు చేపట్టింది.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు గుర్సిదక్ సింగ్, విశాల్ పోలీసులకు ఎదురుపడ్డారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు తమ వాహనాన్ని వదిలేసి పోలీసులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్ ఎడమ చేతికి తగలగా.. మరో బుల్లెట్ ఇన్స్పెక్టర్ అమోలక్ సింగ్ను తాకింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఎదురు కాల్పులు జరపడంతో గుర్సిదక్కు గాయాలయ్యాయి. గాయపడిన అధికారులు, నిందితుడిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని సహచరుడు విశాల్ మాత్రం పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read..
Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. 2024లో 2 వేల కోట్లు స్వాహా
Narendra Modi | శాంతికి ప్రయత్నించిన ప్రతిసారి ద్రోహమే ఎదురైంది.. పాక్తో సంబంధాలపై మోదీ
Ayodhya | ఐదేండ్లలో ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించాం: అయోధ్య రామమందిర ట్రస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

