మోదీ హయాంలో నోట్ల బంద్..బ్యాంకులు బంద్ : దీదీ

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్ని నాశనం చేస్తున్నారని వారు హల్దియా పోర్టునూ త్వరలో అమ్మకానికి పెడతారని దీదీ ఆరోపించారు. బీజేపీ ఫ్యూడల్ భూస్వాముల పార్టీ అని కాషాయ నేతలు లక్షల కోట్ల రూపాయల నిధులను దండుకున్నారని దుయ్యబట్టారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా వసూలైన మొత్తంపై బీజేపీ వాస్తవాలతో ముందుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు తృణమూల్ పార్టీని వీడి కాషాయ తీర్ధం పుచ్చుకున్న అధికారి కుటుంబం తీరును దీదీ ఎండగట్టారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిడ్నపూర్ జిల్లాలోని పుర్బాలో శుక్రవారం జరిగిన తృణమూల్ ప్రచార ర్యాలీలో దీదీ మాట్లాడారు.
అధికారి కుటుంబాన్ని ఆమె మిర్ జాఫర్‌తో పోల్చిన మమతా బెనర్జీ వారు తృణమూల్ పార్టీని వీడటంతో తాము ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. బెంగాల్ నవాబు సిరాజుద్దులా వద్ద బెంగాలీ సైనికాధ్యక్షుడిగా పనిచేసిన మిర్ జాఫర్ ప్లాసీ యుద్ధం సమయంలో నవాబుకు వెన్నుపోటు పొడిచారు. నవాబుకు ద్రోహం చేసిన మిర్ జాఫర్ బ్రిటిషర్ల విజయానికి సహకరించాడు. మిర్ జాఫర్లు (వెన్నుపోటుదారులు) తృణమూల్‌ను వీడటంతో తమకు ఊరట కలిగిందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

