Mamata Banerjee | డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు.. హెలికాఫ్టర్లను బుక్ చేసిన బీజేపీ : మమతా బెనర్జీ
ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు పాలక బీజేపీ పావులు కదుపుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు.
కోల్కతా : ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు పాలక బీజేపీ పావులు కదుపుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం కాషాయ పార్టీ అన్ని హెలికాఫ్టర్లను బుక్ చేసిందని చెప్పారు. మమతా బెనర్జీ సోమవారం టీఎంసీ యువజన విభాగం చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపడితే దేశం నిరంకుశ పాలనలోకి నెట్టబడుతుందని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇతర పార్టీలకు అవకాశం లేకుండా ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా హెలికాఫ్టర్లను ఆ పార్టీ బుక్ చేసిందని దీదీ పేర్కొన్నారు. ఇప్పటికే మతాల మధ్య చిచ్చు రేపిన బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని అది విద్వేష జాతిగా మార్చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్లో మూడు దశాబ్ధాల సీపీఎం పాలనకు తాను పాతరేశానని, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు గోలీ మారో నినాదాలు చేశారని, వర్సిటీలో విద్వేష నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించినట్టు ఆమె తెలిపారు.
Read More :
Rahul Gandhi | నీ ఆటోగ్రాఫ్ ఇస్తావా.. చిన్నారిని అడిగిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

