Opposition Meet | ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : విపక్ష భేటీలో తేల్చిచెప్పిన ఖర్గే
విపక్ష నేతల (Opposition Meet) సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేసినట్టు సమాచారం.
బెంగళూర్ : విపక్ష నేతల (Opposition Meet) సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేసినట్టు సమాచారం. చెన్నైలో స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా తాను ఈ విషయం తేల్చిచెప్పానని, కాంగ్రెస్ పార్టీకి అధికారం పట్ల, ప్రధాని పదవి పట్ల ఆసక్తి లేదని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని ఈ సమావేశంలో విపక్ష నేతలతో కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశం ఉద్దేశం మన కోసం అధికారం సాధించుకోవడం కాదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే మనమంతా కలిశామని ఖర్గే చెప్పుకొచ్చారు.
రాష్ట్ర స్ధాయిలో మన మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, విభేదాలున్నా అవి సిద్ధాంతపరమైనవి కాదని విపక్ష భేటీలో ఖర్గే పేర్కొన్నారు. సగటు వ్యక్తి, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ప్రయోజనాల కోసం చిన్నపాటి విభేదాలను మనం పక్కనపెట్టి పోరాడగలమని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు. ఇక విపక్షాల భేటీలో (Opposition Meeting) రెండో రోజు మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన అంశాలపై బ్లూప్రింట్ తయారుచేసేందుకు కమిటీ ఏర్పాటు కానుంది.
కనీస ఉమ్మడి కార్యక్రమం స్ధానంలో లేవనెత్తాల్సిన ఉమ్మడి అంశాలను గుర్తించి జాబితా రూపొందించేందుకు కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇక యూపీఏ పేరు మార్పు విషయంలోనూ విపక్షాల సమావేశంలో నేతలు కసరత్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న నేతలు నేడు నూతన కూటమి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం వాడరాదని టీఎంసీ సూచించింది.
ఇక బెంగళూర్‌లో విపక్ష సమావేశం రెండో రోజు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకె ఎంపీ టీఆర్ బాలు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. దివంగత నేత మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం విపక్షాల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
Read More :
IKEA India | యువతికి భయంకరమైన అనుభవం.. ఐకియా స్టోర్ లో డిజర్ట్ తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

