Mallikarhun Kharge | సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలను ఏకం చేస్తాం : మల్లికార్జున్ ఖర్గే
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarhun Kharge) స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarhun Kharge) స్పష్టం చేశారు. వీలైనన్ని పార్టీలను ఏకం చేసి రాబోయే రోజుల్లో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఖర్గే బుధవారం కలిసి సంపద్రింపులు జరిపారు.
విపక్షాల ఐక్యత విషయంలో నితీష్ కుమార్ సైతం తమతో ఏకీభవించారని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. విపక్ష నేతలతో జరిగిన సమావేశం చారిత్రాత్మకమని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా ఇది కీలక భేటీ అన్నారు. సైద్ధాంతిక పోరాటంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళతామని, వ్యవస్ధలపై జరిగే దాడులను ఐక్యంగా ప్రతిఘటిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ కీలక భేటీలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ భేటీలో నేతలు ప్రధానంగా చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితే బీజేపీని వంద సీట్లలోపు పరిమితం చేయవచ్చని బిహార్ సీఎం నితీష్ కుమార్ గతంలో పేర్కొన్నారు.
Read More
BRS Party | మహారాష్ట్రలో దూసుకుపోతున్న బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

