ఆ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మహా సర్కార్లోని ఓ మంత్రి రెండోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈమధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. సీఎం ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో ధనుంజయ్ ముండే సామాజిక న్యాయం, స్పెషల్ అసిస్టెన్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (ఎన్సీపీ) చెందిన ఆయన గతేడాది జూన్లో కరోనా బారినపడ్డారు. మరోసారి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విటర్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు.
‘నాకు ఈరోజు రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. తనగురించి భయపడాల్సింది ఏమీలేదు. ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి’ అని మరాఠీలో ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 28,699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరాయి. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకున్నారు.
माझी आज दुसऱ्यांदा कोरोना चाचणी positive आली आहे.गेल्या काही दिवसात माझ्या संपर्कात आलेल्या सर्वांनी आपली तपासणी करून घ्यावी ही विनंती.मी डॉक्टरांच्या सल्ल्यानुसार काळजी घेत आहे. काळजी करण्यासारखं काही नाही.सर्वांनी मास्क वापरावा,सोशल डिस्टन्सचे पालन करावे व स्वतःची काळजी घ्यावी.
— Dhananjay Munde (@dhananjay_munde) March 23, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

