Tomato | టమాటాలు అమ్మి.. నెల రోజుల్లోనే కోటీశ్వరుడైన రైతు
Tomato | ముంబై : దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. టమాటా పండ్లను సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. కానీ టమాటా రైతులు మాత్రం భారీ లాభాలు గడించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరడంతో ఆ రైతులు సంతోషంగా ఉన్నారు.
Tomato | ముంబై : దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. టమాటా పండ్లను సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. కానీ టమాటా రైతులు మాత్రం భారీ లాభాలు గడించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరడంతో ఆ రైతులు సంతోషంగా ఉన్నారు.
మహారాష్ట్ర పుణె జిల్లాలోని తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు 13 వేల క్రేట్ల టమాటాలను నెల రోజుల్లో అమ్మేశాడు. ఇందుకు గానూ రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తుకారానికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా, 12 ఎకరాల్లో టమాటా పంటను పండించాడు. ఈ పంటను పండించేందుకు తన కుటుంబం మొత్తం కష్టపడిందని తుకారాం తెలిపాడు. ఇక టమాటా పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ వాడినట్లు పేర్కొన్నాడు.
ఇక శుక్రవారం ఒక్కరోజే 900 క్రేట్ల టమాటాలు విక్రయించి రూ. 18 లక్షలు సంపాదించాడు. ఇలా పుణెలోని చాలా మంది టమాటా రైతులు కోటీశ్వర్లుగా మారారు. మొత్తంగా పుణెలో ఒక్క నెలలోనే రూ. 80 కోట్ల విలువ చేసే టమాటా విక్రయాలు జరిగాయని రైతుల కమిటీ తెలిపింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే 100 మంది మహిళలకు పైగా ఉపాధి లభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

