Maharashtra Crisis | ఈడీ నోటీసులపై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని కోరింది. ప్రవీణ్ రౌత్, పాత్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో సంజయ్ రౌత్‌కు నోటీసులు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు 2007 నాటిది కాగా.. ఆ సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ పని చేస్తున్నారు. ఈడీ నోటీసులపై సంజయ్ రౌత్ స్పందించారు. ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తాము బాలాసాహెబ్ శివసైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్రని మండిపడ్డారు. ‘నువ్వు నా తల నరికినా.. నేను గౌహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్ చేయండి.. జై హింద్ అంటూ’ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
I just came to know that the ED has summoned me.
Good ! There are big political developments in Maharashtra. We, Balasaheb’s Shivsainiks are fighting a big battle. This is a conspiracy to stop me. Even if you behead me, I won’t take the Guwahati route.
Arrest me !
Jai Hind! pic.twitter.com/VeL6qMQYgr— Sanjay Raut (@rautsanjay61) June 27, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

